మోదీ కుర్తాకు యువత ఫిదా

5 Nov, 2018 08:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ధరించే కుర్తా–జాకెట్‌కు యువతలో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. దేశంలోని ఏడు ఖాదీ ఇండియా అవుట్‌లెట్లల్లో కలిపి రోజుకు 1,400కు పైగా మోదీ కుర్తా–జాకెట్లు అమ్ముడవుతున్నాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) చైర్మన్‌ వీకే సక్సేనా తెలిపారు. కాగా, ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 17న ఈ వస్త్ర శ్రేణిని ఖాదీ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

త్వరలోనే మరిన్ని అవుట్‌లెట్లలో వీటిని అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, కోల్‌కత్తా, జైపూర్, జోథ్‌పూర్, భోపాల్, ముంబై, ఎర్నాకులం ఖాదీ అవుట్‌లెట్లలో సగటున రోజుకు 200కు పైగా మోదీ ‘కుర్తా–జాకెట్లు’ అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఖాదీని ప్రోత్సహించాలన్న నరేంద్రమోదీ పిలుపు ఇవ్వటంతో ఈ వస్త్రాల అమ్మకాలు పెరిగినట్లు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు