మోదీ ప‌ర్య‌ట‌న సైన్యంలో ఆత్మ‌స్థైర్యాన్ని పెంచింది

3 Jul, 2020 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌పై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. మోదీ ప‌ర్య‌ట‌న భార‌త సైన్యంలో మ‌రింత  ఆత్మ‌స్థైర్యాన్ని పెంచుతుంద‌న్నారు. భార‌త సైన్యం నీడ‌లో దేశ స‌రిహ‌ద్దులు ఎల్ల‌ప్పుడూ సుర‌క్షితంగా ఉంటాయన్న రాజ్‌నాథ్..ల‌డ‌ఖ్‌లో మోదీ సంద‌ర్శించ‌డంతో ప్ర‌తీ సైనికుడి ఆత్మ‌స్థైర్యం మ‌రింత రెట్టింప‌య్యింద‌న్నారు. మోదీ చ‌ర్య‌ను స్వాగ‌తిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేర‌కు రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. చైనాతో కొన‌సాగుతున్న ప్ర‌తిష్టంభ‌న నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితుల‌పై స‌మీక్షించేందుకు రాజ్‌నాథ్ ల‌డ‌ఖ్ వెళ్లాల్సి ఉండ‌గా అనూహ్యంగా ఆ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యింది.  (‘ప్రత్యర్ధులకు గట్టి గుణపాఠం’ )

గాల్వ‌న్ లోయ‌లో భార‌త్-చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ల‌డ‌ఖ్‌లోని లేహ్‌ను సంద‌ర్శించి అక్క‌డి  ప‌రిస్థితుల‌పై స‌మీక్షించారు. అంత‌కుముందు గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో గాయ‌ప‌డిన భార‌త జ‌వాన్ల‌ను సైనిక స్థావ‌రం నిములో ప‌రామ‌ర్శించారు. స‌రిహ‌ద్దు వివాదంపై భార‌త్-చైనా క‌మాండ‌ర్ స్థాయి స‌మావేశాల్లో పాల్గొన్న సైనికాధికారుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.   ల‌డాఖ్‌లోని నిము ప్రాంతంలో సీనియ‌ర్ ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌ధాని భేటీ అయ్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మోదీ వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావ‌త్, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వ‌ణే ఉన్నారు. (సరిహద్దు నుంచి యుద్ధ సందేశం )


 

మరిన్ని వార్తలు