క్షయ వ్యాధిపై పోరాడండి: మోదీ

22 Jan, 2018 03:30 IST|Sakshi

న్యూఢిల్లీ: క్షయ వ్యాధిపై యుద్ధ ప్రాతిపదికన పోరాడాలని, సవరించిన జాతీయ క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమం(ఆర్‌ఎన్‌టీసీపీ) ప్రగతిపై కనీసం మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు. క్షయ వ్యాధికి సంబంధించి కేస్‌ నోటిఫికేషన్లు, ట్రీట్‌మెంట్‌ సక్సెస్‌ రేట్‌ మొదలైన అంశాలపై నిశితంగా దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు.

అంటువ్యాధుల్లో అతి ప్రమాదకరమైనది క్షయ అని, ఏటా సుమారు 29 లక్షల మంది దీనిబారిన పడుతున్నారని, ఇందులో సుమారు 4.2 లక్షల మంది ప్రజలు.. ముఖ్యంగా పేదలు టీబీ కారణంగా మరణిస్తున్నారని, దీంతో లక్షలాది మంది చిన్నారులు అనాధలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, క్షయ వ్యాధిగ్రస్థుల పౌష్టికాహారం కోసం నెలకు రూ.500 చొప్పున అందజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

>
మరిన్ని వార్తలు