'వారి కోసం పనిచేస్తే ఎంతో ఆనందం'

1 May, 2016 20:02 IST|Sakshi

వారణాసి: పేదల ప్రజల సాధికారతకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం తన నియోజకవర్గం వారణాసిలో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఈ-రిక్షాలు, ఈ-పడవలు అందజేశారు. సంక్షేమ పథకాలతో నిరుపేదలు బలోపేతం కావాలని, ఓటు బ్యాంకు కాదని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.

పేదలకు చేయూతనిస్తే పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన'తో బ్యాంకులు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. పేద ప్రజల అభ్యన్నతి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. వారణాసిలో ఈ- రిక్షా, ఈ-పడవల్లో మోదీ ప్రయాణించారు.

అంతకుముందు బాలియాలో 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు పంపిణీ చేశారు. 5 కోట్ల మంది పేదలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు