ఇమ్రాన్‌కు దీటుగా బదులిచ్చిన మోదీ

20 Jun, 2019 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పొరుగుదేశం నిర్ధష్ట చర్యలు చేపడితేనే పాకిస్తాన్‌తో సంబంధాలు బలపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాసిన లేఖకు బదులిస్తూ ప్రధాని మోదీ భారత్‌ వైఖరిని తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌తో చర్చలకు ముందు ఉగ్రవాద దాడులు లేని పరస్పర విశ్వాసంతో కూడిన ప్రశాంత వాతావరణం అవసరమని పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాసిన లేఖకు ప్రధాని స్పందిస్తూ ఇమ్రాన్‌కు లేఖ రాశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. కశ్మీర​ సహా అన్ని సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలకు చొరవ చూపాలని ఈ లేఖలో ఇమ్రాన్‌ ఖాన్‌ సూచించారు.

మరోవైపు ఉగ్రవాదం, హింసోన్మాదం లేని శాంతియత వాతావరణం నెలకొంటేనే పాకిస్తాన్‌తో చర్చలు సాధ్యమవుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. పాక్‌తో సహా పొరుగు దేశాలతో శాంతియుత, స్నేహపుర్వక సంబంధాలను భారత్‌ ఆకాంక్షిస్తోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు