జవాన్ల త్యాగం వృథా కాదు : మోదీ

14 Feb, 2019 19:41 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.  జవాన్ల త్యాగం వృథా కాదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమరులైన జవానుల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా నిలుస్తుందని తెలిపారు. గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ఈ దుర్ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడి దాడితీవ్రతను తెలుసుకున్నారు. చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

భారత్‌కు మద్దతిస్తాం..
సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ముష్కరదాడిని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ ఖండించారు. అమరుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రవాదులతో పోరాటం సాగిస్తున్న భారత్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు