పురాతన కెమెరాను తిరిగి ఇవ్వనున్న మోహన్ లాల్

15 Oct, 2013 16:38 IST|Sakshi
పురాతన కెమెరాను తిరిగి ఇవ్వనున్న మోహన్ లాల్

తిరువనంతపురం:మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గతంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న వింటేజ్ (పురాతన) కెమెరాను తిరిగి కేరళ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు ఇవ్వనున్నారు. మోహాన్ లాల్  కేరళ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుంచి తీసుకున్న వింటేజ్ కెమెరా అంశానికి సంబంధించి వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎప్పడూ వివాదాలకు దూరంగా ఉండే మోహన్ లాల్ ఈ అంశాన్ని పెద్దది చేయడం ఇష్టం లేక  కెమెరాపై వెనక్కు తగ్గారు. వింటేజ్ కెమెరాను కేరళ ఫిల్మ్ కార్పోరేషన్ కు అప్పగించేందుకు సన్నద్ధమైయ్యారు.

గత డిసెంబర్ లో ఓ కార్యక్రమానికి నటుడు మోహాన్ లాల్ తో పాటు, కేరళ ముఖ్యమంత్రి ఓమన్ చండీ కూడా హాజరైయ్యారు. ఆ సమయంలో వింటేజ్ కెమెరా కావాలని మోహన్ లాల్ ముఖ్యమంత్రికి విన్నవించడం..అనంతరం కెమెరాను మోహన్ లాల్ కు అప్పగించడం జరిగిపోయాయి.  దానికి బదులు తన వద్ద నున్న 1976 మోడల్ కెమెరాను మోహన్ లాల్ కేసీఎఫ్ డీసీకి ఇచ్చారు. అది కాస్తా కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాలకు కారణమైంది. ఈ అంశానికి సంబంధించి కేఎస్ ఎఫ్ డీసీ చైర్మన్ సబూ చరణ్ కోర్టును ఆశ్రయించడంతో..నటుడు మోహన్ లాల్ తిరిగి ఆ కెమెరాను అప్పగించేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు