గోవాను వణికిస్తున్న కోతి రోగం..

11 Mar, 2018 18:37 IST|Sakshi

35 మందికి సోకిన వ్యాధి..

గతంలో ముగ్గురి మృతి..

పనాజీ:  గోవాని కోతి రోగం హడలెత్తిస్తోంది. గత సంవత్సర కాలంలో 35 మందికి ఈ వ్యాధి సోకినట్లు వాల్‌పోయ్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ అధికారి తెలిపారు. క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డీసీస్‌ (కేఎఫ్‌డీ)గా పిలబడే ఈ వ్యాధి బారిన పడి తీర ప్రాతం సత్తారి తాలుకాలో 2015లో ఒకరు, 2016 లో ఇద్దరు మరణించారు. ఏడాది కాలంలో కేఎఫ్‌డీ బారినపడ్డ 35 మంది సత్తారి తాలుకా కు చెందిన వారేనని ఆయన వెల్లడించారు. అయితే ఆరోగ్య శాఖ చేపట్టిన వ్యాక్సినేషన్‌ చర్యల వల్ల వ్యాధికి గురైన ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అన్నారు.

కోతుల శరీరం పైన ఉండే సూక్ష్మ క్రిముల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. కోతులతో సావాసం చేయడం వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కర్ణాటకలోని క్యాసనూర్‌ అడవిలో 1957లో ఈ వ్యాధిని గుర్తించారని వివరించారు. అందువల్లే ఈ వ్యాధిని ‘క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డిసీస్‌’ గా పిలుస్తున్నారని అన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, రక్తస్రావం ఈ వ్యాధి లక్షణాలు. డెంగ్యూని పోలిన లక్షణాలతో కేఎఫ్‌డీ మరణానికి దారితీస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు