మెట్రోరైలుకు మరిన్ని బోగీలు, మరిన్ని ట్రిప్పులు

10 Nov, 2015 13:02 IST|Sakshi
మెట్రోరైలుకు మరిన్ని బోగీలు, మరిన్ని ట్రిప్పులు

మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరగడం, రైళ్లు ఏమాత్రం సరిపోకపోవడంతో ఉన్న రైళ్లకు మరిన్ని బోగీలు జత చేయాలని, అలాగే రైళ్ల ట్రిప్పులను కూడా బాగా పెంచాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇదే విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును అడిగి హామీ కూడా తీసుకున్నారు. జహంగీర్‌పురి - సమయ్‌పూర్ బద్లీ ఎక్స్‌టెన్షన్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా ఆయనీ విషయం చెప్పారు. 'టీమ్ ఇండియా'గా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్, వెంకయ్య నాయుడు ఇద్దరూ స్పష్టం చేశారు.

కొత్త సెక్షన్‌లో రెండు స్టేషన్ల పేర్లు మార్చాలన్న కేజ్రీవాల్ విజ్ఞప్తిని కూడా వెంకయ్య నాయుడు ఆమోదించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న పురోగామి సభ్యుల్లో వెంకయ్య ఒకరంటూ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో ఇప్పటికే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మెట్రో రైళ్లను ఉపయోగిస్తున్నారని, అయితే కార్లలో వెళ్లేవాళ్లు కూడా వాటిని వదిలిపెట్టి మెట్రో రైలు ఎక్కినప్పుడే అది నిజంగా విజయం సాధించినట్లవుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు