'పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలి'

28 Apr, 2016 15:13 IST|Sakshi

న్యూఢిల్లీ: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం గురువారం ఢిల్లీలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ధర్రేంద్రకు వైఎస్ జగన్ వివరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ  ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

అంతకముందు వైఎస్ జగన్ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీమ్ జైదీని కలిశారు. ఏపీలో ఫిరాయింపుల వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను లోబర్చుకుంటున్న తీరును వివరించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలో 'సేవ్ డెమొక్రసీ' ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ నాయకులతో పాటు వైఎస్ జగన్ ఢిల్లీలో పలువురు జాతీయ పార్టీల నేతలను, కేంద్ర మంత్రులను కలిశారు.
 

మరిన్ని వార్తలు