భారత్‌ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు

22 Oct, 2017 14:23 IST|Sakshi

ఇటు రాఫెల్‌.. అటు ఆర్మ్‌డ్‌ డ్రోన్లు

మరిన్ని రాఫెల్‌ ఫైటర్లు అమ్మందుకు ఫ్రాన్స్‌ సిద్ధం

ఆర్మ్‌డ్‌ డ్రోన్లు అందిస్తామంటున్న అమెరికా

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌ : రక్షణ రంగాన్ని మరింత బలోపేలం చేసేదిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలను మరింత పఠిష్టం చేసుకున్న భారత్‌.. రక్షణ బంధాన్ని ధృఢతరం చేసుకుంటోంది. అమెరికా, ఫ్రాన్స్‌లతో ఇప్పటికే కీలక రక్షణ ఒప్పందాలను చేసుకున్న భారత్‌కు మరిన్ని సానుకూల సంకేతాలను ఆయా దేశాలు పంపాయి. ఫ్రాన్స్‌కు చెందిన శక్తివంతమైన రాఫెల్‌ యుద్ధవిమానాలను మరిన్ని భారత్‌కు అమ్మేందుకు ఫ్రాన్స్‌ అంగీకిరంచింది. అదే విధంగా ఆర్మ్‌డ్‌ డ్రోన్లను భారత్‌కు విక్రయించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

భారత్‌-ఫ్రాన్స్‌ దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్‌ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఫ్రాన్స్‌ రక్షణ శాఖమంత్రి ఫ్లోరున్స్‌ పార్లే వచ్చే వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. గత ఏడాది 36 రాఫెల్‌ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు ఫ్రాన్స్‌ అంగీకరించిం‍ది. ఈ 36 యుద్ధవిమానాలను భారత్‌ రూ. 59 వేల కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ ఆసక్తిని చూపింది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వస్తున్న ఫ్రాన్స్‌ రక్షణ శాఖ మంత్రి భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారమన్‌, ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సీమాంతర ఉగ్రవాదం ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చిస్తారు.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను బలోపేతం చేసే దిశగా ఆర్మ్‌డ్‌ డ్రోన్లను అందించాలని భారత్‌ గతంలో అమెరికాను కోరింది. భారత ప్రభుత్వం ఆర్మ్‌డ్‌ డ్రోన్లపై కనబరిచిన ఆసక్తిని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాజాగా పరిశీలిస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఆర్మ్‌డ్‌ డ్రోన్లు రక్షణ శాఖలో చేరితో.. భారత వాయుదళం మరింత శక్తివంతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఆర్మ్‌డ్‌ డ్రోన్లుగా పిలిచే అవేంజర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల కొనుగోలనుకు సంబంధించి భారత్‌ ఈ ఏడాది అమెరికాకు లేఖ రాసింది. సుమారు 100 ఆర్మ్‌డ్‌ డ్రోన్లును విక్రయించాలని అందులో భారత్‌ కోరిందని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 26న వైట్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా.. 22 గార్డియన్‌ డ్రోన్లకు భారత్‌కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా