పోలింగ్ కు 300 గ్రామాలు దూరం

4 Apr, 2016 17:15 IST|Sakshi

పురులియా: పశ్చిమ బెంగాల్ లోని పురులియా ప్రాంతంలో 300లకు పైగా గ్రామాలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాయి. ఇప్పటికీ తమ గ్రామాలకు విద్యుత్, తాగునీరు ఇవ్వనందుకు నిరసనగా ఓటర్లు ఎన్నికల పోలింగ్ కు దూరంగా ఉన్నారు. తమకు పాలకులు ఇచ్చిన హామీలు నిలుపుకోలేదని ఈ గ్రామాలకు చెందిన ప్రజలు తెలిపారు.

ఇప్పటికీ తమ ఊళ్లలో కరెంట్ లేదని, తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని, తామెందుకు ఓటు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది.

మరిన్ని వార్తలు