చరిత్రలో నిలిచిపోయిన సెలబ్రిటీలు

27 Feb, 2018 16:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సూపర్‌ స్టార్‌ శ్రీదేవీ దుబాయ్‌లో అకాల మరణం చెందడం దశాబ్ద కాలంలోనే పెద్ద చర్చనీయాంశం అయింది. భారతీయులతోపాటు పాకిస్థాన్‌ ప్రజల నివాళులను అందుకుంటున్న ఏకైక తార శ్రీదేవీయే కాచ్చు! జాతి, మత, కుల వైషమ్యాలు లేకుండా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకుని చరిత్రలో నిలిచిపోయే వారు అతి కొద్ది మందే ఉంటారు.

మైఖేల్‌ జాక్సన్‌ (1958–2009)
పాప్‌ సింగర్‌గా ‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ విశ్వవిఖ్యాతి చెందిన మైఖేల్‌ జాక్సన్‌ 2009లో అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో, తన ఇంట్లో అకాల మరణం పొందారు. ఆయన తన పాటలకు సంబంధించి 26 లక్షల డిజిటల్‌ ట్రాక్‌లను విక్రయించడం ద్వారా పది లక్షల డిజిటల్‌ ట్రాక్‌లకన్నా ఎక్కువగా విక్రయించిన ఏకైన సింగర్‌గా కూడా రికార్డు సృష్టించారు.

ఎల్విస్‌ ప్రెస్లీ (1935–1977)
ప్రముఖ అమెరికా గాయకుడు, కంపోజర్, నటుడు ఎల్విస్‌ ప్రెస్లీ తన గానామతంతో ‘కింగ్‌ ఆఫ్‌ రాక్‌ అండ్‌ రోల్‌’గా గుర్తింపు పొందారు. 20వ శతాబ్దంలో ఆయన పాట వినని ఇల్లంటూ అమెరికా, యూరప్‌ దేశాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకన్న ఆయన తన 42వ ఏట బాత్‌రూమ్‌లోనే కన్నుమూశారు. ఆయన అప్పటికే చిన్న ప్రేగు సమస్యతో బాధ పడుతున్నారు.

ప్రిన్సెస్‌ డయానా (1961–1997)
బ్రిటిష్‌ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్‌ డయానా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఎంటర్‌డేన్‌మెంట్‌ సెలబ్రిటిగా గుర్తింపు పొందారు. 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. ఆమెతోపాటు అ ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు.

మార్లిన్‌ మాన్రో (1926 –1962)
హాలీవుడ్‌ శృంగార తారగా 1950వ దశకంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మార్లిన్‌ మాన్రో పిన్న వయస్సులో, అంటే 36వ ఏట అకాల మరణం చెందారు. నాడీ మండలం చికిత్సకు వాడే ‘బార్బిటు రేట్‌’ ఒవర్‌ డోస్‌ వల్ల మరణించారు.

విట్నీ హూస్టన్‌ (1963–2012)
తన పాటలతో ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తూ ‘బిల్‌బోర్డ్‌ ఆల్బమ్‌ అవార్డు’ను దక్కించుకొని అనేక అవార్డులు పొందిన మహిళా సింగర్‌ ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కిన విట్నీ హూస్టన్‌ కూడా వాటర్‌ టబ్‌లోనే మరణించారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌లో గెస్ట్‌ రూమ్‌లో 2012, ఫిబ్రవరి 11వ తేదీన ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత మూడేళ్లకు అంటే, 2015లో ఆమె కూతురు బొబ్బి కష్ణా బ్రౌన్‌ కూడా నీటి తొట్టిలోనే కోమాలోకి వెళ్లి ఆర్నెళ్లలోగా మరణించారు.

ప్రిన్స్‌  రోగర్స్‌ నెల్సన్‌ (1958 నుంచి 2016)
పాటకు తగ్గ నత్యంతో యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ అమెరికా సింగర్‌ ప్రిన్స్‌ రోగర్స్‌ నెల్సన్‌ తన 57వ ఏట ‘ఫెంటానిల్‌’ ఒవర్‌ డోస్‌ కారణంగా అకాల మరణం చెందారు. అభిమానులు ‘ప్రిన్సి’గా పిలుచుకునే రోగర్స్‌ పలు వాయిద్యాల్లో ఆరితేరిన విద్వాంసుడు. బెస్ట్‌ సెల్లింగ్‌ పాప్‌ సింగర్‌గా పాపులర్‌.

మరిన్ని వార్తలు