సెర్చ్‌లో ‘కరోనా’యే టాప్‌

3 Jul, 2020 05:27 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బలహీనపడుతోందా? భారతదేశంలో కరోనా వాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది? అసలు ఈ మహమ్మారికి ముగింపు ఉందా? ఇలాంటి ప్రశ్నలను జూన్‌ నెలలో భారతీయ నెటిజన్లు సెర్చ్‌ చేసినట్టు గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌కి ఏ మాస్క్‌ మంచిది, కరోనా వైరస్‌ని న్యూజిలాండ్‌ ఎలా అణచివేసింది, కరోనా వైరస్‌ లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి, ప్రపంచంలో కరోనా వైరస్‌ వల్ల ఎంతమంది మరణించారు లాంటి ప్రశ్నలను నెటిజన్లు అడిగినట్లు గూగుల్‌ డేటా ద్వారా తెలిసింది. మేతో పోలిస్తే జూన్‌లో కరోనా వైరస్‌ గురించి నెటిజన్లు సెర్చ్‌ చేయడం 66 శాతం తగ్గింది, ఫిబ్రవరిలో కంటే జూన్‌లో కరోనాపై గూగుల్‌ సెర్చ్‌ రెట్టింపు కంటే ఎక్కువైందని తేలింది.

మరిన్ని వార్తలు