కరోనాతో తల్లి మృతి.. పీపీఈ లేకుండానే!

4 Jul, 2020 12:52 IST|Sakshi

మంబై : కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. మానవాళిని మహమ్మారిలా పీడిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో విషాద చాయలు మిగులుస్తోంది. తమ వారిని కోల్పోయి వారికి తీరని వేదనను గురిచేస్తోంది. తాజాగా అలాంటి వాటికి అద్దంపట్టే ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నగరంలోని బోరివాలకి చెందిన పల్లవి అనే మహిళకు(50) జూన్‌ 30న కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంతేగాక ఆమె భర్త సైతం కరోనా బారిన పడ్డారు. వీరికి 21 ఏళ్ల కుమారుడు కునాల్‌ ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృత్యువాత పడింది. తల్లి మరణ వార్తను కుమారుడికి చెప్పి వెంటనే ఆస్పత్రికి రావాలని కోరారు. (రెండుసార్లు కరోనా నెగిటివ్​.. డాక్టర్‌ మృతి )

హుటాహుటిన అక్కడికి చేరిన యువకుడిని తన తల్లి శవాన్ని బ్యాగ్‌లో పెట్టేందుకు ఆస్పత్రి సిబ్బంది బలవంతం చేశారు. ఇందుకు ఆ యువకుడు తనకు పీపీఈ కిట్‌ ఇవ్వమని కోరినా.. అందుకు వారు నిరాకరించారు. ఒకవైపు తల్లి మరణ వార్తను తట్టుకోలేక తల్లడిల్లుతున్న యువకుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే కోవిడ్‌-19 వార్డులోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తల్లి మృతదేహాన్ని బ్యాగ్‌లోకి పెట్టేందుకు సహాయం అందిచాడు. (బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్‌)

ఈ సంఘటను కునాల్‌ గుర్తు చేసుకుంటూ.. ‘ఆస్పత్రి సిబ్బంది పీపీఈ ఇవ్వడానికి నిరాకరించడం నాకు షాక్‌కు గురి చేసింది. పీపీఈ లేకుండా నేను కరోనా మృతదేహాన్ని ఎలా తాకాలని వారిని ప్రశ్నించాను. ఇందుకు వారు శరీరం బరువుగా ఉందని సాయం చేయాలని కోరారు. అక్కడుంది నా తల్లి, నాకు వేరే దారి లేదు. నా భయాన్ని పక్కన పెట్టి పీపీఈ లేకుండానే నా తల్లిని పట్టుకున్నాను’. అంటూ ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్..‌ ఆసుపత్రికి చెందిన ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (ఉబర్‌ ముంబై ఆఫీసు శాశ్వతంగా మూత?)

>
మరిన్ని వార్తలు