మదర్ థెరిసా దైవదూత

19 Dec, 2015 17:41 IST|Sakshi
మదర్ థెరిసా దైవదూత

ధ్రువీకరించిన వాటికన్ సిటీ
వచ్చే ఏడాది సెయింట్‌హుడ్
 

 కోల్‌కతా: భారత రత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాను దైవదూత(సెయింట్)గా వాటికన్ సిటీ ధ్రువీకరించినట్లు మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీతా కుమార్ తెలిపారు. వైద్య రంగంలో అద్భుతాలు సృ ష్టించిన మదర్‌కు ఈ హోదా దక్కినట్లు వెల్లడించారు. మదర్‌లోని అతీత శక్తిని పోప్ గుర్తించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 4న రోమ్‌లో ఆమెకు అధికారికంగా ఈ హోదా ఇవ్వనున్నట్లు క్యాథలిక్ పత్రిక అవెనైర్ ప్రకటించింది. మదర్‌కు సెయింట్‌హుడ్ దక్కడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి అభినందనలు తెలిపారు.

మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో తుదశ్వాస విడిచారు.

మరిన్ని వార్తలు