‘మామ్‌ కాలింగ్‌’

12 May, 2018 18:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాతృదినోత్సవం సందర్భంగా యూ ట్యూబ్‌లో ‘మామ్‌ కాలింగ్‌’ వీడియో ఒకటి నెటిజనులను  ఆకట్టకుంటోంది. మే  నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్‌ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  సౌత్‌  ఇండియన్‌ లీడింగ్‌  విమెన్స్‌ మ్యాగజైన్‌ ‘జస్ట్‌ ఫర్‌ విమెన్‌’ ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన  అ‍మ‍్మను మించిన ప్రయారిటీ మనకు మరేముంటుందనే సందేశంతో  ఉన్న  ఈ వీడియో  పలువురి నెటిజనులతో సహా, సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది.   ముఖ్యంగా  ఈ వీడియోను లాంచ్‌ చేసిన  ప్రముఖ హీరో  సూర్య,   టాలీవుడ్‌   సంగీత దర్శకుడు ఎస్‌ ఎస్‌ తమన్‌ తదితరులు ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు.

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జన్మనిస్తుంది.  ప్రాణాలను పణంగా పెట్టయినా బిడ్డలను కాపాడుకుంటుంది. జీవితాంతం ఇదే అనుబంధం అమ్మసొంతం.  సృష్టిలో ఏ జీవికైనా ఇంతకంటే  ఏం కావాలి..అయితే..ఈ స్పూర్తిని, ప్రేమను మదర్స్‌ డే పేరుతో ఏదో ఒక రోజుకు పరిమితం చేయడం న్యాయమా   అనే వాదన ఉన్నప్పటికీ...అమ్మ బిడ్డల పట్ల  చూపించే , ఆప్యాయత, ఆదరణను,  బిడ్డలు కూడా  చూపించడం న్యాయం.  ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.  మన తొలి ప్రాధాన్యత అమ్మదే..  ఇదే  ఈ వీడియో సారాంశం....

అందుకోండి మరి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను ప్రేమించండి...ఎప్పటికీ.. అచ్చం అమ్మలాగే!

మరిన్ని వార్తలు