వాహన పత్రాల చెల్లుబాటును పొడిగించిన కేంద్రం

9 Jun, 2020 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాహనాల ఫిట్ నెస్, పర్మిట్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తో సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. కరోనా విజృంభి​స్తుండటం, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఫ్రిబ్రవరి 2020తో పత్రాల చెల్లుబాటు ముగిసిన వారు రెన్యూవల్‌ చేయించుకోవడానికి జూన్‌ వరకు మొదట గడువునిచ్చిన కేంద్రప్రభుత్వం జూన్‌ నాటికి దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పౌరులకు ఇబ్బంది కలిగించకూడదే ఉద్దేశంతో   వాహన పత్రాల చెల్లుబాటు తేదీని పొడిగించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం అందించింది. (వైరస్ బారిన ఒకే కుటుంబంలో 26 మంది)

మరిన్ని వార్తలు