చిక్కుల్లో ప్రజ్ఞా ఠాకూర్‌

22 May, 2019 02:14 IST|Sakshi

భోపాల్‌: భోపాల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై 12ఏళ్ల క్రితం నమోదైన హత్యకేసును మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తిరిగి విచారించాలని నిర్ణయించింది. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో ప్రజ్ఞాసింగ్‌ విజయం సాధించనున్నారని తేలిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ సునీల్‌జోషి హత్యకేసులో ప్రజ్ఞాసింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిప్పటికీ ఈ కేసును పునర్విచారించేందుకు న్యాయసలహా తీసుకుంటున్నామని న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ మంగళవారం వెల్లడించారు. 2007 డిసెంబర్‌ 29న దేవస్‌ జిల్లాలో సునీల్‌జోషి హత్యకు గురయ్యారు. సరైన సాక్ష్యాధారాలులేని కారణంగా 2017లో ప్రజ్ఞాసింగ్, మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సునీల్‌ జోషి హత్యకేసు పునర్విచారణకు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని శర్మ తెలిపారు.  

మరిన్ని వార్తలు