కూతురుతో స్టెప్పులేసిన ముఖేష్‌ అంబానీ

9 May, 2018 12:05 IST|Sakshi

ముంబై: భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన గారాల పట్టి ఈషా వివాహం పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత అజయ్‌ పిరమాల్‌ తనయుడు ఆనంద్‌తో నిశ్చయం కావడంతో ఆ కుంటుంబం సంబరాల్లో మునిగితేలుతోంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఈషా అంబానీ, ఆనంద్‌ పిరమాల్‌ల ఎంగేజ్‌మెంట్ పార్టీని ముఖేష్‌ అంబానీ కుటుంబం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు షారూక్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈషా తన తల్లిదండ్రులతో కలిసి స్టెప్పులు వేసింది. ముఖేష్‌ అంబానీ తన కూతురుతో కలిసి సింగర్‌ హర్షదీప్‌ కౌర్‌ ‘ముద్డే నా దేఖో దిల్బారో’  పాటకు ఆనందంగా స్టెప్పులేశారు. ఇక ఇషా తల్లి నీతా అంబానీతో కలిసి కత్రినా కైఫ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర నటించిన బార్‌బార్ ‌దేఖో చిత్రంలోని నచాదే నె సారే పాటకు, శ్రీదేవి నటించిన ఇంగ్లిష్‌ వింగ్లిష్‌, తదితర బాలీవుడ్‌ సినిమాల పాటలకు స్టెప్పులేసి అందరిని అలరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు