ఒడిషాలో హై అథ్లెటిక్‌ సెంటర్‌ : ముఖేష్‌ అంబానీ

12 Nov, 2018 12:55 IST|Sakshi
భువనేశ్వర్‌లో జరిగిన మేక్‌ ఇన్‌ ఇండియా సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు

భువనేశ్వర్‌ : ఒడిషాలో మానవ వనరుల అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముఖేష్‌ అంబానీ స్పష్టం చేశారు. సోమవారం భువనేశ్వర్‌లో మేక్‌ ఇన్‌ ఒడిషా సదస్సులో పాల్గొన్న ముఖేష్‌ అంబానీ ఒడిషాలో భారీ పెట్టుబడులకు సిద్ధమనే సంకేతాలు పంపారు.

ఒడిషాలో యువతకు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ హై అథ్లెటిక్స్‌ సెంటర్‌ను నెలకొల్పుతామని ప్రకటించారు. 21వ శతాబ్ధం యువత నైపుణాల్యపై అపార నమ్మకంతో ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ కలలుగంటున్న న్యూ ఒడిషా సాకారానికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు.

ఒడిషాలోని అన్ని గ్రామాలు, పట్టణాలను రిలయన్స్‌ జియో ద్వారా డిజిటల్‌ కనెక్టివిటీతో అనుసంధానిస్తామని చెప్పారు. స్మార్ట్‌ మిషన్‌ శక్తి స్కీమ్‌ కింద మహిళలకు స్మార్ట్‌ ఫోన్లను చేరువ చేస్తామన్నారు. ఈ సదస్సులో కుమార మంగళం బిర్లాతో సహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు