మ‌రోసారి ఆసుప‌త్రి పాలైన ములాయం

11 May, 2020 07:58 IST|Sakshi

ల‌క్నో : స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ మ‌రోసారి ఆసుప‌త్రి పాల‌య్యారు. ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌ల‌తో రెండు రోజుల క్రొత‌మే ఆసుప‌త్రి పాలైన ములాయం..సోమ‌వారం తెల్ల‌వారుజామున మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో వెంట‌నే ఆయ‌న్ని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గ‌త ఐదు రోజుల్లోనే రెండు సార్లు ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్.. ములాయం సింగ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

అంత‌కుముందు స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ , ములాయం సోద‌రుడు శివ‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం ఆరోగ్యం గురించి చాలామంది శ్రేయాభిలాషులు ఆందోళ‌న చెందుతున్నారు..ప్ర‌స్తుతం దేవుని ద‌య వ‌ల్ల ములాయంసింగ్  ఆరోగ్యం బాగానే ఉంది. దీర్ఘ‌కాలం ఆయ‌న జీవించాల‌ని దేవుడిని ప్రార్థించండి" అంటూ కోరారు. 

 

మరిన్ని వార్తలు