ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం

5 Sep, 2014 22:48 IST|Sakshi

అగర్తలా : ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్‌ఎఫ్) శుక్రవారం అంగరంగ  వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడురోజులపాటు జరగనుంది. ఇందులోభాగంగా పురస్కారం పొందిన ఏడు దేశాలకు చెందిన 30 చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఫిలిమ్స్ డివిజన్, యునెటైడ్ ఫిలిమ్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (యూఎఫ్‌పీఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవాన్ని త్రిపుర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి భానులాల్ సహా ప్రారంభించారు. కాగా ఈ 30 చిత్రాల్లో కొన్ని డాక్యుమెంటరీలు, మరికొన్ని లఘు చిత్రాలు, మరికొన్ని యానిమేషన్ సినిమాలు ఉన్నాయి. ఇవి ఆస్ట్రేలియా, భారత్, రొమేనియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బంగ్లాదేశ్, అజర్‌బైజాన్, నార్వే దేశాల్లో రూపొందాయి.

మరిన్ని వార్తలు