క‌రోనాపై అసత్య ప్రచారం: వ‌్య‌క్తి అరెస్టు

6 Apr, 2020 14:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: క‌రోనా వైర‌స్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే కాక వ్యాప్తి నివార‌ణ‌కు ఇంటి నుంచి బ‌య‌టకు రావ‌ద్దంటూ ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. అంతేకాక క్షేత్ర‌స్థాయిలో ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. అయితే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ప్ర‌భుత్వాల కుట్రేన‌ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా అస‌త్య ప్ర‌చారానికి దిగిన వ్య‌క్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని ముంబైలోని ఖురేషీన‌గ‌ర్‌కు చెందిన ష‌మీమ్ ఇఫ్త‌ర్‌ఖాన్‌గా గుర్తించారు. (కరోనా అలర్ట్‌ : కరీంనగర్‌లో హైటెన్షన్‌!)

అత‌డు ఫేస్‌బుక్‌లో.. ఈ వైర‌స్ ఇప్పుడు ఉనికిలో లేద‌ని అస‌త్య ప్ర‌చారం చేశాడు. పైగా ప్ర‌భుత్వం కొన్ని వ‌ర్గాల‌ను ఇబ్బంది పెట్టేందుకు కావాల‌ని కుట్ర ప‌న్నుతోందని పేర్కొన్నాడు. స‌ర్వే గురించి అధికారులు ఎవ‌రైనా ఇంటికి వ‌స్తే వారికి ఎలాంటి స‌మాచారం ఇవ్వకండ‌ని సూచించాడు. దీంతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మే కాక క‌రోనా వైర‌స్ ఉనికిలోనే లేదంటూ దుష్ప్ర‌చారానికి దిగిన వ్య‌క్తిపై పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. (సైకిల్‌పై మంత్రి.. అడ్డుకున్న పోలీసులు)

మరిన్ని వార్తలు