కరోనా అలర్ట్‌ : ప్రయాణాలకు దూరం..

15 Mar, 2020 14:03 IST|Sakshi

ముంబై : కరోనా వ్యాప్తితో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే దిశలో ముంబై పోలీసులు ప్రజలను ఇంటిపట్టునే ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా గుంపుగా పలువురితో కలిసి విదేశాలు లేదా దేశంలోని ఇతర ప్రాంతాలను ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్ల సాయంతో చుట్టివచ్చేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. టూర్‌ ఆపరేటర్లతో సహా ఏ ఒక్కరూ అత్యవసర పరిస్థితుల్లో మినహా పోలీసుల అనుమతితోనే నగరాన్ని వీడాలని ముంబై పోలీసులు పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రజలకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు బదులు నమస్కారం అంటూ విష్‌ చేయాలని ఉన్నతాధికారులు ముంబై పోలీసులకు సూచించారు. పోలీస్‌ స్టేషన్లలో సిబ్బందితో పాటు ట్రాఫిక్‌ పోలీసులకు మాస్క్‌లను అందచేశామని, కరోనా నిరోధనాకి మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని ముంబై డీసీపీ ప్రణయ్‌ అశోక్‌ తెలిపారు. మరోవైపు వైరస్‌ వ్యాప్తిపై వదంతులను నమ్మరాదని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో ఇప్పటికే 31 మందికి ఈ వైరస్‌ సోకగా దేశవ్యాప్తంగా 93 కేసులు నమోదయ్యాయి.

చదవండి : 'నేను రావడం లేదు.. మీరు రావద్దు'

మరిన్ని వార్తలు