ఖైదీల పలాయనంపై కమిషనర్‌ సీరియస్‌

27 Sep, 2013 20:00 IST|Sakshi

సాక్షి, ముంబై:  పోలీసుల కళ్లుగప్పి ఖైదీలు పారిపోతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో అధికం కావడం పట్ల నగర పోలీసు కమిషనర్‌ సత్యాపాల్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది సిబ్బంది నిర్వాకంవలే  ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దీని వలన మొత్తం పోలీసు శాఖకే మచ్చ వస్తుందన్నారు. ఇటీవల ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాది అఫ్జల్‌ ఉస్మానీ నాటకీయంగా పారిపోయాడు. తాజాగా శక్తిమిల్లులో మహిళా ఫొటోగ్రాఫర్‌పై సామూహిక అత్యాచారం కేసులో సిరాజ్‌ రెహమాన్‌ పారిపోయినట్లు వదంతులు వచ్చాయి.

 

గతంలో కూడా అనేక మంది ఖైదీలు వివిధ సందర్భాల్లో పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. ఈ నేపథ్యంలో ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సింగ్‌ ఆదేశించారు. ‘‘ఖైదీలను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో పోలీసులు, అధికారులు పాటించాల్సిన నియమ, నిబంధనలపై ఓ సర్క్యులర్‌ జారీచేశారు.

మరిన్ని వార్తలు