లాక్‌డౌన్ ముగిశాక వీళ్లేం చేస్తారో తెలుసా?

8 Apr, 2020 20:50 IST|Sakshi

సాక్షి,ముంబై : ఇంట్లో కూర్చొని హాయిగా ఉండ‌మంటే కొంత‌మంది మాత్రం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా బ‌య‌ట తిరుగుత‌న్నారు. అయితే మ‌న‌ల్ని ర‌క్షించ‌డానికి డాక్ట‌ర్లు,నర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది, పోలీసులు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. మ‌న భ‌ద్ర‌త దృష్ట్యా వాళ్లు త‌మ వ్య‌క్తిగ‌త సంతోషాల‌కు దూర‌మ‌య్యారు. చాలా మంది కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా ఉంటున్నారు. లాక్‌డౌన్‌ను క‌శ్చితంగా పాటించేలా పోలీసులు కృషి చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తార‌న్న‌దానిపై క్లారిటీ లేక‌పోయినా లాక్ డౌన్ ముగిసిన త‌ర్వాత ఏమేం చేయాలో ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే ప్ర‌శ్న ముంబాయి పోలీసుల‌ను అడిగితే వాళ్లేం స‌మాధానం ఇచ్చారో తెలుసా? అంటూ  ఓ వీడియోను రూపోందించారు. ఈ వీడియోకు ఇప్ప‌టికే 78 వేల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. 

విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా చాలా వ‌ర‌కు ఇంట్లో వాళ్ల‌తో గ‌డిపే స‌మ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఒక‌వేళ అవ‌కాశం ఉంటే 21 రోజులు ఉంట్లోనే ఉంటామ‌ని అంటున్నారు ముంబై పోలీసులు. మీ ర‌క్ష‌ణ కోసం పోలీసులు బ‌య‌ట ఉంటే, మ‌రి వారికోసం మీరు బాధ్య‌త‌గా ఉండ‌లేరా అంటూ వీడియోని ఎండ్ చేశారు. నెటిజ‌న్లను ఈ వీడియో తెగ ఆక‌ట్టుకుంటుంది. ఇక దేశంలో 5194 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదవ్వ‌గా, 149 మంది చ‌నిపోయారు. ఏప్రిల్‌14న దేశ‌వ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్ గ‌డువు ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా