‘బాయ్స్‌ లాక్‌ రూం’పై పోలీసుల ట్వీట్‌

5 May, 2020 18:24 IST|Sakshi

ముంబై: బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొట్టేలా కొంతమంది యువకులు ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ పేరిట గ్రూప్‌లో సంభాషించిన ఓ ఆడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఆ గ్రూప్‌ సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సదరు యువకుల చర్యను ఖండిస్తూ ముంబై పోలీస్‌ ఓ సందేశం ఇచ్చారు. అంతేగాక అమ్మాయిలను మానసికంగా, లైంగికంగా వేధించే విధంగా వారి సంభాషణ ఉండటంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘బాయ్స్‌ లాక్‌ ఎర్రర్‌’?.. ఇక్కడ మహిళలను అగౌరవ పరిచే స్థలం లేదు" అంటూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీనికి ‘‘పురుషుడు ఎప్పటికీ పురుషుడే. వీరిని ఎప్పటికీ క్షమించరాదు. ఇక ముందు కూడా ఇలాంటి వారు రాకుండా ఉండాలంటే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీంతో వారిపై సోషల్‌​ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. (పోలీసుల అదుపులో ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ సభ్యుడు)

కాగా ఆ బాలుర చర్యను వ్యతిరేకిస్తూ మహిళలకు మద్దతుగా నిలిచిన ముంబై పోలీసులపై వివిధ రకాలుగా తమ స్పందనలను తెలుపుతూ నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ఢిల్లీ మహిళా సంఘం చీఫ్‌ కమిషనర్‌ స్వాతి మాలివాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా  ఢిల్లీ పోలీసులకు మే 4న నోటిసులు జారీ చేస్తూ.. మే 8 నాటికి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నోటిసులో ‘‘బాయ్స్‌ లాకర్‌ రూం’’ అనే పేరుతో కొంతమంది పాఠశాల బాలురు మైనర్‌ బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలని రెచ్చగొడుతూ చట్ట విరుద్దమైన చర్యలకు పాల్పడ్డారు. వీరిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె నోటీసులో పేర్కొన్నారు. (అశ్లీల ఫొటోలు షేర్‌ చేసి.. విపరీత వ్యాఖ్యలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు