డెలివరీ బాయ్స్‌పై పోలీసుల సీరియస్‌

6 May, 2019 14:47 IST|Sakshi

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నోటీసులు! 

సాక్షి, ముంబై: ఇళ్లకు, కార్యాలయాలకు వేడివేడి ఫుడ్‌ సరఫరా చేస్తున్న ప్రముఖ స్విగ్గీ, జొమాటో కంపెనీ యాజమాన్యాలకు నోటీసులు జారీచేయాలని ట్రాఫిక్‌ శాఖ భావిస్తోంది. ఇందులో పనిచేసే డెలివరీ బాయ్‌లు తమ ప్రాణాలను ఫణంగా పెడుతూట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై దూసుకెళుతున్నారు. దీంతో వారిని నియంత్రించాలని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయనుంది.  

డెలివరీ తొందరగా ఇవ్వడానికి.. 
నేటి ఆధునిక యుగంలో బయట ఫుడ్‌కు చాలా మంది అలవాటు పడ్డారు. డబ్బుకు విలువలేకుండా పోయింది. ఉద్యోగం చేసే దంపతులతోపాటు ఇళ్లలో ఉండే సామాన్య ప్రజలు కూడా రెడీమేడ్‌ ఫుడ్‌కు ఆకర్షితులయ్యారు. డోమినోజ్‌ ఫిజ్జా,పాశ్చత్యదేశాల ఫుడ్‌పై కూడా మోజు పెంచుకున్నారు. కేవలం ఫోన్‌ చేస్తే చాలు కొద్ది నిమిషాల్లోనే ఇంటి గుమ్మం ముందుకు తము ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ ప్రత్యక్షమైతుంది. ఇలాంటి వారికి తినుబండారాలు సరఫరా చేసే స్విగ్గి, జోమేటో కంపెనీలునగరంలో అక్కడక్కడ తమ బ్రాంచ్‌లు తెరిచాయి.

కానీ, అందులో పనిచేస్తున్న డెలీవరి బాయ్‌లు పనితీరు సక్రమంగా లేదు. అడ్డగోలుగా బైక్‌లు వేగంగా నడుపుతున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బాయ్‌లు తొందరగా డెలీవరి చేసి మరో ఆర్డర్‌ దక్కించుకోవాలనే తపనతో ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌లను ఆపే ప్రయత్నం చేసినా తప్పించుకు పారిపోతున్నారు. వీరి ప్రాణాలకు రక్షణ లేకపోవడమేగాకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే ఆస్కారముంది. దీంతో డెలీబాయ్‌లకు మార్గదర్శనం చేయాలని లేదంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయకతప్పదని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు