గాయపడిన పోలీస్‌ ప్రాణం కాపాడిన ముస్లిం

29 Dec, 2019 05:06 IST|Sakshi

ఆగ్రా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటి పరిస్థితుల్లో ఓ ముస్లిం మత గురువు మానవత్వం ప్రదర్శించాడు. కోపంతో రాళ్లు విసురుతున్న నిరసనకారుల నుంచి గాయపడిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను కాపాడాడు. ఉత్తరప్రదేశ్‌లో ఫిరోజాబాద్‌ జిల్లాలోని ఓ మసీదులో గత వారం ప్రార్థనలు ముగించుకుని వస్తున్న 52 ఏళ్ల హాజీ ఖాదిర్‌కు కానిస్టేబుల్‌ అజయ్‌ కుమార్‌ గాయాలతో కనిపించాడు. నిరసనకారులు అజయ్‌పై దాడికి ప్రయత్నించగా ముందు తనను చంపి కానిస్టేబుల్‌పై దాడి చేయమని ఆందోళనకారులకు అడ్డు నిలిచాడు. అజయ్‌ను దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు అజయ్‌ను ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఖాదిర్‌ ప్రదర్శించిన తెగువ, మానవత్వాలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా