‘ముస్లిం పెళ్లి చట్టాల’పై నివేదిక ఇవ్వండి: సుప్రీం

29 Mar, 2016 04:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ముస్లిం వైవాహిక చట్టాలపై అధ్యయనానికి నియమించిన కమిటీ రూపొందించిన నివేదికను 6 వారాల్లోగా తమ ముందుంచాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం అనుసరిస్తున్న బహుభార్యత్వం, తలాక్ విధానాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ థాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తూ.. కమిటీ నివేదికను తమ ముందుంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.

మరిన్ని వార్తలు