బహుభార్యత్వం పిటిషన్లపై ఇంప్లీడ్‌

28 Jan, 2020 04:43 IST|Sakshi

సుప్రీంకోర్టులో ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కక్షిదారుగా చేర్చుకోవాలంటూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌(ఏఐఎంపీఎల్‌బీ) భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ంది. ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాలపై దాఖలైన పిటిషన్లను 1997లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏఐఎంపీఎల్‌బీ తన ఇంప్లీడ్‌ పిటిషన్‌లో పేర్కొంది.

బహుభార్యత్వ సంప్రదాయం ప్రకారం...ఒక ముస్లిం వ్యక్తికి నలుగురు భార్యలుండవచ్చు. అదేవిధంగా నిఖా హలాలా..భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడిని వివాహం చేసుకోవాలంటే.. మొదటగా ఆమె మరో వ్యక్తి పెళ్లి చేసుకుని, అతడి కి విడాకులివ్వడం తప్పనిసరి. ఈ రెండు ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ఢిల్లీకి చెందిన నఫీసా ఖాన్‌ అనే మహిళ 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు.

మరిన్ని వార్తలు