జిన్నా ఫొటో అంత ముఖ్యమా!: రాందేవ్

9 May, 2018 13:48 IST|Sakshi
యోగా గురువు రాందేవ్‌ బాబా

ఏఎంయూలో వివాదంపై స్పందించిన రాందేవ్‌ బాబా

పట్నా: అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో వివాదంగా మారిన మహ్మద్‌ అలీ జిన్నా చిత్రపటంపై ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా స్పందించారు. ముస్లింలు చిత్ర పటాలకు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వరని, కానీ జిన్నా ఫొటోకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. బిహార్‌లోని ప్రతిష్టాత్మక నలందాలో ఏర్పాటు చేసిన  యోగా కార్యక్రమంలో రాందేవ్‌ పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం రాందేవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా వారి దేశానికి గొప్పవ్యక్తి కావచ్చు. భారతదేశ ఐక్యత, సమగ్రతను నమ్మేవారు జిన్నాను ఆదర్శ వ్యక్తిగా భావించకూడదు. ముస్లిం మతస్తులు విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రాధాన్యత ఇవ్వరు. అందులో భాగంగానే జిన్నా చిత్రపటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని’  పేర్కొన్నారు. కాగా మే 3న యూనివర్సిటీ విద్యార్థులకు, హిందూత్వ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 28 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు