ముస్లింలకు దారుల్‌ ఉలూమ్‌ కొత్త ఫత్వా

19 Oct, 2017 15:24 IST|Sakshi

దియోబంద్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) : భారతదేశంలోని ముస్లింలెవరూ సోషల్‌ మీడియాలో వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను పెట్టరాదంటూ ముస్లిం మత సంస్థ దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ గురువారం ఫత్వా జారీ చేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షరణ్‌పూర్‌ జిల్లాలో ఉన్న దారుల్‌ ఉలూమ్‌ సంస్థ.. దేశవ్యాప్తంగా ఇస్లామిక్‌ సెమినార్లు నిర్వహిస్తుంది. సోషల్‌ మీడియాలు ఫొటోను పోస్ట్‌ చేయడం అనేది ఇస్లామ్‌కు విరుద్ధమని ఆ సంస్థ తెలిపింది. సోషల్‌ మీడియాలో ఫొటోలను పోస్ట్‌ చేయడం తప్పంటూ దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ చీఫ్‌ షహనవాజ్‌ ఖాద్రీ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. దీనిపై దారుల్‌ ఉలూమ్‌ చేసిన ఫత్వాను ఆయన సమర్థించారు.

మరిన్ని వార్తలు