‘ప్రాధాన్య శాఖ ఇచ్చారు.. థ్యాంక్స్‌’

3 Sep, 2017 18:49 IST|Sakshi
‘ప్రాధాన్య శాఖ ఇచ్చారు.. థ్యాంక్స్‌’

న్యూఢిల్లీ: క్రీడాకారులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ ఫెడరేషన్లకు కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్ విజ్ఞప్తి చేశారు. ఆటగాళ్లను అత్యంత ప్రముఖులుగా పరిగణించాలని సూచించారు. క్రీడల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి, ప్రాధాన్యత కలిగిన శాఖ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్ ఘనతకెక్కారు. ఒక క్రీడాకారుడు ఈ శాఖను దక్కించుకోవడం ఇదే ప్రథమం. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌లో వెండి పతకం సాధించారు. దశాబ్ధంపైగా షూటర్‌గా కొనసాగిన ఆయన పలు పతకాలు గెల్చుకున్నారు. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లోనూ మెడల్స్‌ సాధించారు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పదశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. క్రీడాకారుడైన రాజ్యవర్థన్‌కు సంబంధిత మంత్రిత్వ శాఖ అప్పగించడంతో దేశంలో క్రీడారంగానికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు