నగరం దుర్ఘటన దిగ్బ్రాంతి కలిగించింది: నిర్మలా సీతారామన్

27 Jun, 2014 19:59 IST|Sakshi
నగరం దుర్ఘటన దిగ్బ్రాంతి కలిగించింది: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: తూర్పు గోదావరి జిల్లా నగరంలో చోటుచేసుకున్న గెయిల్‌ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దుర్ఘటనలోని బాధితులందరికీ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుందని నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. త్వరతిగతిన బాధితులందరికి సహాయచర్యలు అందేలా చూస్తానని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. 
 
ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో  15 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలు కాగా, వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. 
మరిన్ని వార్తలు