‘భౌతిక దూరం సత్తా తెలుసుకోండి’

6 Apr, 2020 11:28 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనెల సినిమా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లోని ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్‌ తీవ్రత రోజుకు రోజుకు పెరిగిపోతోంది. ఈనేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించడం ఒకటే మార్గం. (కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయ‌ని)

ఈ క్రమంలో కరోనాపై అవగాహన కల్పించేందుకు నాగ్‌పూర్‌ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఈ సినిమాలోని షారుక్‌ పాపులర్‌ డైలాగ్‌ ‘డోంట్‌ అండర్‌ ఎస్టిమేట్‌ ద పవర్‌ ఆఫ్‌ కామన్‌ మ్యాన్‌’తో సోషల్‌ మీడియాలో అవగాహన చర్యలు చేపట్టారు. షారుక్‌, దీపికాలు రైల్వే స్టేషన్‌లోని బెంచ్‌పై ఎడంగా కూర్చుని ఉన్న సన్నివేశానికి ‘‘డోంట్‌ అండర్‌ ఎస్టిమేట్‌ ద పవర్‌ ఆఫ్‌ సోషల్‌ డిస్టెస్సింగ్‌‌’’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న నాగ్‌పూర్‌ పోలీసులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. (సైకిల్‌పై మంత్రి.. అడ్డుకున్న పోలీసులు)

కాగా షారుక్‌ ఆయన భార్య గౌరీ ఖాన్‌లు తమ 4 అంతస్తుల వ్యక్తిగత ఆఫీసును క్వారంటైన్‌ కోసం బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ భవననాన్ని క్వారంటైన్‌లో ఉండే మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం కేటాయించారు. అంతేగాక షారుక్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజ్‌ జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) ద్వారా పీఎమ్‌ సహాయ నిధికి సహకరిస్తున్నారు. అలాగే తన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిలిం ప్రొడక్షన్‌ ద్వారా మహరాష్ట్ర సీఎం సహయ నిధికి విరాళం ప్రకటించారు. (కరోనా నియంత్రణకు కేంద్రం బృహత్తర ప్రణాళిక)

>
మరిన్ని వార్తలు