రోజుకు 8 గంటలు చదివా: టాపర్‌

5 Jun, 2019 19:52 IST|Sakshi
నలిన్‌ ఖండేల్‌వాల్‌

జైపూర్‌: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకు సాధించడం పట్ల రాజస్థాన్‌ విద్యార్థి నలిన్‌ ఖండేల్‌వాల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. రోజుకు ఎనిమిది గంటలు చదివానని చెప్పాడు. తన విజయానికి కారణమైన టీచర్లకు ధన్యవాదాలు తెలిపాడు. 720 గానూ 701 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచాడు. బుధవారం విడుదల చేసిన నీట్‌ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన భవిక్‌ భన్సాల్‌ రెండో ర్యాంక్‌, ఉత్తరప్రదేశ్‌ విద్యార్థి అక్షత్‌ కౌశిక్‌ మూడో ర్యాంక్‌ దక్కించుకున్నారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించిన నీట్‌లో సుమారు 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా ఓబీసీకి చెందిన 3.75 లక్షల విద్యార్థులు అర్హత సాధించారు. అన్‌రిజర్వుడు కేటగిరీ నుంచి 2.8 లక్షల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎస్సీ విభాగం నుంచి దాదాపు లక్షమంది, ఎస్టీ కేటగిరి నుంచి 35 వేల మంది విద్యార్థులు అర్హత పొందారు. అక్రమాలకు పాల్పడిన నలుగురు విద్యార్థుల ఫలితాలను రద్దు చేశారు.

మెరుగుపడిన తమిళనాడు
గతేడాది నీట్‌ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసిన తమిళనాడు ఈసారి మెరుగుపడింది. 48.57 శాతం​ ఉత్తీర్ణత సాధించింది. గతేడాది 39.56 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు చేసింది. (చదవండి: నీట్‌ ఫలితాలు విడుదల)

మరిన్ని వార్తలు