నిలిచిన నమో టీవీ ప్రసారాలు

21 May, 2019 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ: నమో టీవీ ప్రసారాలు ఈ నెల 17 నుంచి ఆగిపోయినట్లు బీజేపీ వర్గాలు చెప్పా యి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ లు, సందేశాలను ఈ చానల్‌లో బీజేపీ ప్రసా రం చేసింది. ఈ చానల్‌ను కేవలం ఎన్నికల ప్రచారం కోసమే ప్రారంభించారనీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం 17న ముగిసిన వెంటనే దీని ప్రసారాలు కూడా ఆగిపోయాయని బీజేపీ నేత ఒకరు చెప్పారు. చానల్‌ మొదలైన ప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో మునుగు తూనే ఉంది. నిశ్శబ్ద సమయం ప్రారంభమైన తర్వాత కూడా ఎన్నికల కార్యక్రమాలను ప్రసారం చేసినందుకు ఢిల్లీ ఎన్నికల ప్రధా నాధికారి ఈ చానల్‌కు నోటీసులు పంపారు. అయితే  ఎన్నికల నిబంధనవాళిని ఉల్లంఘిం చలేదని చానల్‌ తెలిపింది. రికార్డ్‌ చేసిన అన్ని కార్య క్రమాలను ధ్రువీకరించిన తర్వాతనే టీవీలో ప్రసారం చేయాలని కోరగా, ఢిల్లీ ఎన్నికల కమిషన్‌ కూడా అదే విషయం స్పష్టం చేసింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ఎన్నికల నిబంధనావళిని ఉల్లం ఘించి చానల్‌ను బీజేపీ ప్రారంభించినందు న దాని కార్య క్రమాలను నిలిపి వేయాలని  విపక్షాలు కోరడంతో దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖను ఈసీ కోరింది. 

మరిన్ని వార్తలు