రైలు ప్రమాదంపై అమిత్‌ షా దిగ్భ్రాంతి

8 May, 2020 11:11 IST|Sakshi

న్యూఢిల్లీ : మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఈ ఘటనపై హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధను కలిగించిందని అమిత్‌ షా అన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌, ఇతర రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి : రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీల మృతి)

రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇది చాలా విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని చెప్పారు. కాగా, ఔరంగాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 16మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. (చదవండి : మరో ప్రమాదం; ప్రధాని మోదీ ఆవేదన)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు