దటీజ్,....మోదీ!

1 Apr, 2015 13:41 IST|Sakshi
దటీజ్,....మోదీ!

న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల కోసం సామాజిక వెబ్‌సైట్లను విశేషంగా ఉపయోగించుకొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రభుత్వ పథకాలకు ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక విమర్శలను తిప్పికొట్టడం కోసం వాటిని క్రియాశీలకంగా ఇప్పటికీ ఉపయోగించుకుంటున్న విషయం తెల్సిందే. వారానికోసారి 'మన్ కీ బాత్' పేరిట ఆకాశవాణిని తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్న మోదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి డీడీ మీద కన్నేశారు.

ప్రతిపక్షాలు లేదా ఇతర పక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు, ప్రభుత్వ పథకాలకు విశేష ప్రాచుర్యం కల్పించేందుకు డీడీ ద్వారా ఓ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రసార భారతిని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డీడీ తెర వెనక నుంచి ఈ పోర్టల్ కార్యకలాపాలను చూడాల్సిన బాధ్యతను  ప్రముఖ రాజకీయ విమర్శకుడు సుబ్రహ్మణియం స్వామికి అప్పగించినట్టు తెలుస్తోంది.  ఇంతకుముందు అధికారంలోవున్న రాజకీయ పక్షాల్లాగా విపక్షాలపై అనవసరంగా నోరు పారేసుకోకుండా, ప్రస్తుతమున్న  మీడియాపై నియంత్రణ తీసుకురావడం లేదా మీడియాను ప్రలోభాలకు గురిచేయకుండా ఇలా తనదైన మీడియాను తీసుకొస్తున్నారు. దటీజ్,...మోదీ!

 

మరిన్ని వార్తలు