కరోనా నియంత్రణలో కీలక పాత్ర: నరేంద్ర మోదీ

17 Jul, 2020 22:15 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే భారత్‌ మెరుగైన స్థానంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి అత్యున్నత సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ఉపన్యాసం చేశారు. నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్త‌మ కోవిడ్‌-19(కరోనా నియంత్రణ) రిక‌వ‌రీ రేట్ల‌లో భార‌త‌దేశం ఒక‌ట‌ని ‌మోదీ అన్నారు. కరోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటాన్ని ప్ర‌జా ఉద్య‌మంగా మార్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం, పౌర స‌మాజాన్ని మహమ్మారీని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.  కాగా దేశంలో 2022 నాటికి ప్ర‌తీ పౌరుడు సొంతింట్లో ఉండే విధంగా అంద‌రికి ఇళ్లు నిర్మించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. 

ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి మొదటి అధ్యక్షుడు ఒక భారతీయుడేనని గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి ఎజెండాను రూపొందించడానికి భారత్ కూడా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య కార్య‌క్ర‌మం ద్వారా దేశ ప్రజల ఆరోగ్యానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు  40 కోట్ల మందితో బ్యాంక్ ఖాతాలు తెరిపించిన‌ట్లు పేర్కొన్నారు. మరోవైపు 7 కోట్ల మంది మ‌హిళ‌లు స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లో ఉన్నారన్న ప్ర‌ధాని భార‌త్‌ను 2025 నాటికి టీబీ ర‌హిత దేశంగా మారుస్తామని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు