ఆ క్షణాలు మరచిపోలేనివి..

26 Jul, 2019 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ : కార్గిల్‌ అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ఆయన ట్వీటర్‌లో తన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. కార్గిల్‌ యుద్ద సమయంలో వీరోచితంగా పోరాడిన భారత మాత ముద్దు బిడ్డలకు ఆయన వందనాలు సమర్పించారు. ఈ రోజు మన సైనికులు ధైర్య, సాహసాలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. మాతృ భూమిని కాపాడుకోవడం సర్వస్వం అర్పించిన అమరవీరులకు వినయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాకుండా కార్గిల్‌ గొప్ప తనాన్ని తెలిపేలా ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.

ఆ క్షణాలు మరచిపోలేనివి..
కార్గిల్‌ యుద్ధ సమయంలో సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ యుద్దం జరుగుతున్న సమయంలో తాను జమ్మూ కశ్మీర్‌తోపాటు, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ (బీజేపీ) కోసం పనిచేస్తున్నట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో తనకు కార్గిల్‌ వెళ్లి.. మన వీర సైనికులను కలిసే అవకాశం వచ్చిందని తెలిపారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా, సరిగా ఇరవై ఏళ్ల క్రితం భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ముష్కరులకు భారత సైనికులు నిలువరించారు. సాహసోపేతంగా పోరాడి ముష్కరులు తోకముడిచేలా చేశారు. 1999  జూలై 26న ఈ యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది. ఇందుకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వేదనలో ఉన్నా.. ఇక కాలమే నిర్ణయిస్తుంది’

జిల్లాల్లో ‘పోక్సో’ ప్రత్యేక కోర్టులు

ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు

చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు

న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!

ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

‘ట్రిపుల్‌ తలాక్‌’కు లోక్‌సభ ఓకే

బీహార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోల మృతి

ఇమ్రాన్‌ చెప్పారు కదా..ఇక రంగంలోకి దిగండి!

వరుడిని ఎత్తుకొచ్చి తంతు; ఆ పెళ్లి చెల్లదు!

పార్లమెంట్‌ సమావేశాలు పొడగింపు

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రసాదంలో విషం కలిపి..

ఐఐటీల్లో రెండేళ్లలో 2461 డ్రాపవుట్లు

బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : కంప్యూటర్‌ బాబా

మోదీకి ప్రముఖుల లేఖ.. అనంత శ్రీరామ్‌ కౌంటర్‌

‘కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది’

ఆమె పొట్టలో కిలోన్నర బంగారం..

లోక్‌సభలో ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై దుమారం

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

ఇమ్రాన్‌ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్‌ కౌంటర్‌

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..

‘అందుకే ఆమెను సస్పెండ్‌ చేశాం’

‘ఆ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు’

ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని

‘హర్‌నాథ్‌ జీ.. పద్ధతిగా మాట్లాడండి’

నాకూ వేధింపులు తప్పలేదు!: ఎంపీ

తెలుగుసహా 9 భాషల్లోకి ‘సుప్రీం’ తీర్పులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో