రామానుజాచార్య తపాలాబిళ్ల ఆవిష్కరణ

1 May, 2017 19:49 IST|Sakshi

న్యూఢిల్లీ : రామానుజాచార్య సహస్రాబ్ది సందర్భంగా ఆయన జ్ఞాపకార్థకం రూపొందించిన తపాలాబిళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సోమవారం ఇక్కడి ప్రధాని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్, అనంత్‌కుమార్, త్రిదండి చినజీయర్‌ స్వామి తదితరలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామానుజాచార్య తొలి తపాలాబిళ్లను ప్రధాని మోదీ చేతులమీదుగా గవర్నర్‌ నరసింహన్‌ అందుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ.. మోక్షానికి సంబంధించిన గురుమంత్రాన్ని అప్పట్లో రహస్యంగా ఉంచితే.. సర్వజనుల హితం కోసం రామానుజాచార్యులు దానిని బహిర్గతం చేశారన్నారు. ప్రజలను కలిపేందుకు విశిష్టాద్వైతం ద్వారా ఆయన ఎంతో కృషి చేశారని, విభిన్న జాతుల వారిని ఆలయాల్లో సభ్యులుగా చేర్చిన మహనీయుడు రామానుజాచార్యులని మోదీ కొనియాడారు.

మరిన్ని వార్తలు