రికార్డు స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు

13 Mar, 2017 14:13 IST|Sakshi
రికార్డు స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీ ఎన్నికల్లో ఈసారి అత్యధికంగా మహిళలు గెలుపొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది సరికొత్త రికార్డుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్‌ చేశారు. కాగా మీడియా కథనాలు ప్రకారం 38మంది మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ 43మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించగా, వారిలో 32మంది విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్‌, బీఎస్పీ పార్టీల నుంచి చెరో ఇద్దరు, సమాజ్‌వాదీ, అప్నా దళ్‌ పార్టీల నుంచి ఒకొక్కరు గెలుపొందారు.  కాగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలు ఉండగా...గెలుపొందిన మహిళల శాతం వీరి గెలుపు శాతం (9.2) పది కంటే తక్కువగా ఉంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూపీలో పెద్ద మొత్తంలో మహిళలు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు