వైరలవుతోన్న మోదీ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌

23 Jul, 2019 17:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోలు ఆయన అభిమానులతో పాటు.. మీడియా వర్గాల్లో కూడా కాసేపు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్‌లో మోదీ.. ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారు’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్‌లతో తెగ వైరల్‌ అయ్యాయి.
 

A very special friend came to meet me in Parliament today.

A post shared by Narendra Modi (@narendramodi) on

దాంతో పాటు మోదీ చేతుల్లో ఉన్న చిన్నారి ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు బీజేపీ పార్లమెంట్‌ మెంబర్‌ సత్యనారాయణ జతియా మనవడిగా తెలీంది. అయితే ఈ ఫోటోలపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సెటైర్లు వేశారు.

‘క్యూట్‌ ఫోటోలు. గత రాత్రి నుంచి ప్రతిపక్షాలు ట్రంప్‌ మధ్యవర్తిత్వం గురించి మోదీని ప్రశ్నిస్తున్నాయి. వాటికి సమాధానంగా మోదీ ఇలాంటి ఫోటోలను పోస్ట్‌ చేసి.. ప్రతిపక్షాలకు ఎంత విలువ ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు’ అంటూ విమర్శిస్తూ ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ‘సురక్షితమైన చేతుల్లో భవిష్యత్తు’ అంటూ బీజేపీ నాయకులు ఈ విమర్శలను తిప్పి కొట్టారు.
 

మరిన్ని వార్తలు