‘డిస్కవరీ’లో మోదీ

30 Jul, 2019 03:31 IST|Sakshi
జిమ్‌కార్బెట్‌ పార్కులో డిస్కవరీ సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌తో ఉన్న ప్రధాని మోదీ

ముంబై: డిస్కవరీ టీవీ చానల్‌ ప్రసారం చేసే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ప్రత్యేక ఎపిసోడ్‌లో నరేంద్ర మోదీ కనిపించనున్నారు. పర్యావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ డిస్కవరీ ఈ ఎపిసోడ్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో సాహసాలు చేస్తూ కనిపించే బేర్‌ గ్రిల్స్‌తో కలిసి మోదీ కూడా ప్రత్యేక ఎపిసోడ్‌లో నటించారు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో జరిగింది. ఆగస్టు 12న 180 దేశాల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

దీనిపై మోదీ ఓ ప్రకటన చేస్తూ ‘చాలా సంవత్సరాలపాటు నేను ప్రకృతి ఒడిలో, పర్వతాల నడుమ, అడవుల్లో జీవించాను. ఆ అనుభవాలు నా జీవితంపై చెరగని ముద్ర వేశాయి. రాజకీయాలకు సంబంధం లేని, ప్రకృతితో ముడిపడిన ప్రత్యేక కార్యక్రమం కావడంతో ఇందులో నటించేందుకు నేను ఒప్పుకున్నాను’ అని తెలిపారు. భారత పర్యావరణ సంపదను ప్రపంచానికి చూపేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన, ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరాన్ని చాటిచెప్పేందుకు తనకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని మోదీ చెప్పారు. ఈ ఎపిసోడ్‌ టీజర్‌ను బేర్‌ గ్రిల్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ, మోదీతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

రేపు కంచికి రానున్న ప్రధాని
సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులోని కాంచీపురానికి రానున్నారు. 40 ఏళ్లకోసారి దర్శనమిచ్చే అత్తివరదరాజస్వాముల వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ నెల 1 నుంచి స్వామివారు శయనరూపంలో దర్శనమిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షాకింగ్‌ : మూడు లక్షల ఉద్యోగాలకు ఎసరు

మాజీ సీఎం అల్లుడు అదృశ్యం

నేడు పెద్దల సభ ముందుకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

రైల్వే ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

టైగర్‌ జిందా హై..!

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..

అటెండెన్స్‌ ప్లీజ్‌! అంటున్న ఆవు

పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు!

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

బీజేపీ ఎంపీలకు రెండ్రోజుల శిక్షణ..

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

దేశంలో పులుల సంఖ్య వెల్లడించిన మోదీ

లోక్‌సభలో ఆజం ఖాన్‌ క్షమాపణ

రాజ్యసభలో షార్ట్‌ సర్క్యూట్‌; పొగలు!

ఉన్నావ్‌ ప్రమాదానికి కారణం అదే..

జనారణ్యంలో కారుణ్యమూర్తి

జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు

కశ్మీర్‌పై అత్యవసర భేటీకి షా పిలుపు

ఇక మగాళ్లూ పుట్టరు

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌