ఒక్కరోజులో 9500 ప్రాజెక్టులు

22 Aug, 2017 09:31 IST|Sakshi
ఒక్కరోజులో 9500 ప్రాజెక్టులు

న్యూఢిల్లీ :  ఈనెల 29న కేవలం ఒకరోజులోనే ప్రధానమంత్రి నరేం‍ద్ర మోదీ 9500 రోడ్డు ప్రాజెక్టులకు లైన్‌ క్లియర్‌ చేయనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. వీటిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులున్నాయని అధికారులు చెప్పారు. రూ 27,000 కోట్ల విలువైన ఈ రోడ్డు ప్రాజెక్టుల్లో కొన్నింటిని ప్రారంభిస్తుండగా, మరికొన్నింటికి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ, రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజే పాల్గొంటారు.

873 కిమీ పరిధిలో నిర్మిం‍చిన 11 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. రోడ్డు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో మోదీ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి భారీస్ధాయిలో ప్రధాని సమక్షంలో భారీ స్ధాయిలో ప్రాజెక్టులను చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు