బోడో ఒప్పందం చారిత్రాత్మకం : ప్రధాని

7 Feb, 2020 16:32 IST|Sakshi

గుహావటి : గత డిసెంబర్‌లో పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ చట్టం బిల్‌ పాస్‌ అయి అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రంలో శుక్రవారం పర్యటించారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను ఏమాత్రం పట్టించుకోలేదని మోదీ తెలిపారు. కొన్ని దశాబ్ధాలుగా బోడో మిలిటెంట్లతో ఈ ప్రాంతం నిరసన, హింసతో అట్టుడికిపోయేదని, కొన్ని వేలమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారని మోదీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కోక్రాఝర్‌ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ బోడో వేడుకను ఒక పండుగలా జరుపుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో అస్పాం రాష్ట్రంలో శాంతి మంత్రం కోసమే బోడో వంటి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నట్లు గుర్తుచేశారు.(నెహ్రూపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు)

ప్రధాని మాట్లాడుతూ.. ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌( ఎబిఎస్‌యూ), నేషనల్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌(ఎన్‌డిఎఫ్‌బి), బిటిసి చీప్‌ హగ్రమా మొహిలరీ, అస్సాం ప్రభుత్వం బోడో ఒప్పందం సక్రమంగా జరగడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వారందరికి తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ తెలిపారు. చారిత్రాత్మకమైన బోడో ఒప్పందం ద్వారా ఇక నుంచి అస్సాం ప్రాంతం అభివృద్ధి బాటలో పయనించనుందని మోదీ వెల్లడించారు. అస్సాంలో బోడో డామినేట్‌ ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో జనవరి 27న కేంద్ర ప్రభుత్వంతో నేషనల్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌, అల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌, ఇతర పౌర సమాజ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.ఈ ఒప్పందం జరిగిన రెండు రోజులకే వేల సంఖ్యలో బోడో మిలిటెంట్లు వచ్చి తమ ఆయుధాలు సరెండర్‌ చేశారని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలపై పట్ల గత ప్రభుత్వాల్లాగా కాకుండా తమ ప్రభుత్వం ఎంతో ప్రేమ చూపుతోందన్నారు. ఒకప్పుడు కేంద్రం ఎలాంటి నిధులు ఇస్తుందోనని ఈశాన్య రాష్ట్రాలు ఎదురుచూసేవని... కానీ ఇప్పుడు అవే ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధిలో కీలకంగా మారాయని మోదీ తెలిపారు. చారిత్రాత్మక బోడో ఒప్పందం ద్వారా ఇకపై ఈ ప్రాంతంలో హింసకు తావు లేకుండా శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టం అమలు తర్వాత తాను ఈశాన్య రాష్ట్రంలో అడుగుపెడితే కర్రలతో తనను తరిమి కొడతారని కొందరు వాఖ్యానించినట్లు మోదీ పేర్కొన్నారు. ' ఈరోజు నేను ఈశాన్య రాష్ట్రంలో అడగుపెట్టాను. ఏ ఒక్కరు నాపై కర్రలతో దాడి చేయకపోగా నన్ను సాధరంగా ఆహ్వానించారు. నా వెనుక వేల సంఖ్యలో అక్కా, చెల్లెమ్మల ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవరు తరిమికొట్టలేరని ప్రధాని మోదీ రాహుల్‌ గాంధీని ఉద్ధేశించి ట్విటర్‌ వేదికగా పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు.

>
మరిన్ని వార్తలు