ఈ వేడుక‌లు మ‌రింత బ‌లాన్నివ్వాలి

14 Apr, 2020 11:15 IST|Sakshi

స‌మిష్టిగా క‌రోనాను ఎదుర్కోవాలి

దేశంలో నేడు నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకుంటున్న ప‌లు రాష్ట్రాల‌కు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ట్విట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. అస్సాం, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లో ప్రారంభ‌మైన ఈ పండుగలు మ‌న‌లో సోద‌ర‌భావాన్ని మ‌రింత పెంపొందిస్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. నేడు కొత్త సంవ‌త్స‌రాన్ని స్వాగ‌తించిన ఆయా రాష్ట్రాల‌కు అనుగుణంగా త‌మిళ్‌, బెంగాలీ, అస్సామీ భాష‌ల్లో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రూ ఆయురారోగ్యాల‌తో, సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని మోదీ కోరుకున్నారు. (ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస)

రాబోయే కాలంలో కరోనా వైర‌స్‌తో స‌మిష్టిగా పోరాడేందుకు ఈ వేడుక‌లు మ‌రింత బ‌లాన్నిస్తాయ‌ని ట్వీట్ చేశారు. కాగా నేడు ప్రారంభ‌మ‌వుతున్న కొత్త సంవ‌త్స‌రాన్ని బెంగాలీ ప్ర‌జ‌లు ప‌హేలా బైషాఖ్ అని పిలుచుకుంటారు. కేర‌ళ‌లో విషు అని, త‌మిళ‌నాడు, అస్సాంలో పుత్తండు లేదా బిహు అని పిలుస్తారు. ఇదిలావుండ‌గా లాక్‌డౌన్ చివ‌రిరోజున ప్ర‌ధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా దేశంలో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. (చైనాను మించిన న్యూయార్క్‌)

మరిన్ని వార్తలు